సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2023 (15:53 IST)

భూపాలపల్లిలో ఘోరం : పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం

car accident
తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాను డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాను డ్రైవర్ మృతి చెందగా, బస్సు డ్రైవర్‌తో పాటు మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు అలుముకుంటుంది. ఈ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 
 
కొత్త సంవత్సరం రోజున ముంబై నగరాన్ని పేల్చేస్తాం : అంగతకుడి హెచ్చరిక.. హైఅలెర్ట్  
 
కొత్త సంవత్సరం రోజైన జనవరి ఒకటో తేదీన ముంబై మహానగరాన్ని బాంబులతో పేల్చివేస్తామని ముంబై నగర పోలీసులకు ఓ అగంతకుడు ఫోనులో హెచ్చరించాడు. న్యూ ఇయర్ రోజున వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు హెచ్చరించాడు. ఈ మేరకు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోను చేశాడు. దీంతో ముంబై నగర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించిన పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టారు. అయితే, ఇప్పటివరకు ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
 
కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ అగంతకుడు శనివారం సాయంత్రం 6 గంటలకు ఫోను చేసి బెదిరించాడు. న్యూ ఇయర్ రోజున వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగర వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.