సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (12:25 IST)

మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రిని చూసిన కుమార్తెలు.. ఏం చేశారంటే?

Father
Father
మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రిని ఆరేళ్ల తర్వాత అనాధాశ్రమంలో చూసి కూతుళ్ల భావోద్వేగానికి లోనైయ్యారు. హైదరాబాద్‌లోని మాతృదేవోభవ అనాధాశ్రమానికి అన్నదానం చేయడానికి వెళ్లిన కూతుళ్లు.. అక్కడ తండ్రిని ఆ పరిస్థితిలో చూసి భావోద్వేగానికి గురయ్యారు. 
 
ఆ తండ్రికి కూతుళ్లు వారేననే విషయం తెలియక అయోమయానికి గురయ్యాడు. అక్కడ వున్న వారు వారే మీ కుమార్తెలు అని చెప్పడంతో వాళ్లను అలా చూస్తూ వుండిపోయాడు. 
 
మతిస్థిమితం కోల్పోయి ఆరేళ్లుగా అక్కడే ఉంటున్న తండ్రిని చూసి కూతుళ్లు గుర్తుపట్టారు. 130 మందిలో తండ్రిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కుమార్తెలను చూసి అక్కడున్నవారంతా కంటతడిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.