ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:24 IST)

గురుకులాల్లో ఆగని సిబ్బంది వేధింపులు - విద్యార్థినుల రోదన (Video)

girls student protest
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు ఉపాధ్యాయుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నెలవారీ పీరియడ్స్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే ఆలస్యం ఎందుకు అవుతుందంటూ పీఈటీ ఉపాధ్యాయురాలు జ్యోత్స్న తమను వేధిస్తోందంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 
 
ముఖ్యంగా స్నానం చేస్తుంటే బాత్రూమ్ తలుపులు పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోనుతో వీడియో రికార్డు చేస్తూ కొడుతోందని వారు బోరున విలపిస్తూ చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
పీఈటిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో 500కు పైగా విద్యార్థినులు పాల్గొన్నారు. అలాగే, హాస్టల్ ప్రాంగణంలో కేవలం రెండు బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేసారు. అలాగే, పీఈటీ టీచర్ కొట్టిన దెబ్బలను చూపిస్తూ బోరున విలపించారు.