గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (09:38 IST)

కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించిన మహిళా కాంగ్రెస్ నేతలు

Women Congress leaders
Women Congress leaders
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేతల ఆగ్రహానికి కారణమయ్యారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మహిళా కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి ఎమ్మెల్యేకు చెప్పులు చూపించారు. 
 
బీఆర్‌ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నానని వాటిని వేసుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై శోభారాణి, ఇతర కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అలాగే, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఆయనను విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు.
 
బీఆర్ఎస్ ప్రతి అంశంలో మహిళలను తీసుకువచ్చి రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు.  రాజకీయాల్లో మహిళలను అవమానించేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన పోరాడింది మహిళలేనన్నారు. మరోసారి చీరలు గాజులు చూపిస్తే కౌశిక్ రెడ్డి చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించారు.