ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (21:28 IST)

చిన్ని చిన్ని గసగసాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మహిళలకు?

Poppy seeds
చిన్ని చిన్ని గసగసాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గసగసాల్లో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల గుండె జబ్బులను నివారిస్తుంది. గసగసాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గసగసాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.  
 
అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి. గసగసాల్లో పుష్కలంగా పీచు పదార్థం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గసగసాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని మృదువుగా చేసి, ముడతలు పడకుండా కాపాడుతాయి. 
 
గసగసాలను మహిళలు వాడటం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గసగసాలు మూత్రపిండాలను శుభ్రపరచి, మూత్రపిండాల సమస్యలను తగ్గిస్తాయి. తలలో చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను నివారిస్తాయి.