సోమవారం, 16 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (18:59 IST)

మహిళలూ యవ్వనంగా వుండాలంటే.. జొన్నరొట్టె తినాల్సిందే..

Jowar Rotti
Jowar Rotti
జొన్నల్లోని మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, జింక్ వంటివి మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే జొన్నపిండితో చేసే జొన్న రొట్టెలు తినటం వల్ల బరువు పెరగకుండా వుంటారు. జొన్నల్లోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జొన్న రొట్టెలు సాయం చేస్తాయి. 
 
జొన్నలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జొన్న రొట్టెలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. క్రమం తప్పకుండా జొన్న రొట్టెలను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. 
 
జొన్న రొట్టెలను క్రమం తప్పకుండా తినడం వల్ల వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది. అందుకే యవ్వనంగా వుండాలంటే జొన్న రొట్టెలను తప్పక తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.