శనివారం, 14 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (17:49 IST)

యాపిల్ తొక్కలోని ఆరోగ్యం.. మహిళలూ తేలిగ్గా తీసిపారేయకండి..

Apple peel
యాపిల్ తొక్కలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. అందుకే యాపిల్ తొక్కను తేలికగా తీసి పారేయకూడదని అంటారు. 
 
యాపిల్ తొక్కలోని ఫైబర్ గంటల తరబడి కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. యాపిల్ పీల్స్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి. 
 
యాపిల్ తొక్కలో క్వెరెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను, గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. 
 
యాపిల్ పీల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాపిల్‌ పండ్లను తొక్కతో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.