శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (12:50 IST)

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

Money
సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు లెక్కల్లో చూపని డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దర వ్యక్తుల నుంచి  రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 
 
సమాచారం మేరకు ఎస్‌ఓటీ (మాదాపూర్) రాయదుర్గం వద్ద ఎస్‌యూవీని ఆపి వాహనంలో రూ.50 లక్షలు గుర్తించారు.

ఆ మొత్తాన్ని తీసుకువెళ్లిన వ్యక్తుల వద్ద.. ఆ నగదుకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. దీనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.