శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 మార్చి 2024 (19:37 IST)

సామాజిక సేవతో గ్రాండ్ గా జరగబోతున్న రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

22 days charan
22 days charan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో, రాష్ట్రంలలోనూ సేవా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తండ్రి చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తులు. దానితో  తండ్రి భక్తితో శ్రీ రామ్ చరణ్ గారు కూడా శ్రీ ఆంజనేయస్వామిపై భక్తి పెంచుకున్నారు.
 
hanuman chalisa
hanuman chalisa
ఈ సందర్బంగా.. ఈ ఏడాది రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ చాలీసా పఠించాలని మెగా అభిమానుల ఆకాంక్ష.  హనుమాన్ చాలీసా పఠనం సర్వ మానవాళికీ శ్రేయస్కరం.  శ్రీ రామ్ చరణ్ గారి పుట్టినరోజు నాడు హనుమాన్ చాలీసా పఠనంతో ఆయనకూ.. మనకూ మంచి జరుగలనే శుభసంకల్పానికి ఈ మహత్కార్యానికి శ్రీకారం చుడుతున్నాం. అభిమానులు అందరూ ఈ బృహత్కార్యంలో పాల్గొని  సనాతన ధర్మాన్ని రక్షిస్తూ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం అంటూ అఖిల భారత చిరంజీవి యువత ప్రకటనలో పేర్కొంది.
 
మరోవైపు ఇతర రాష్ట్రాలలో చరణ్ మరిన్ని  సినిమాలు చేసి గ్లోబల్ స్టార్ కు న్యాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మార్చి 27 న రామ్ చరణ్ జన్మదినం. కనుక ఇంకా 22 డేస్ వుందని లెక్కలేస్తూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు అభిమాన సంఘాలు తెలియజేస్తున్నాయి.