శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (15:58 IST)

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

Pen Cap
Pen Cap
21సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తూ పెన్ క్యాప్ తీసుకున్న వ్యక్తి ఊపిరితిత్తుల నుండి హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రి వైద్యులు పెన్ క్యాప్‌ను తొలగించారు. కరీంనగర్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తి ఇటీవల నిరంతర దగ్గు, వివరించలేని బరువు తగ్గడం వల్ల ఆసుపత్రిని సంప్రదించాడు.
 
గత 10 రోజులుగా ఆ యువకుడి పరిస్థితి గణనీయంగా దిగజారిందని, నిద్రపోవడం కూడా కష్టమైందని కిమ్స్ హాస్పిటల్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ కన్సల్టెంట్ శుభకర్ నాదెళ్ల అన్నారు.
 
"రోగి వచ్చినప్పుడు, మేము సీటీ స్కాన్ నిర్వహించాం, ఇది అతని ఊపిరితిత్తుల లోపల ఒక ముద్ద లాంటి నిర్మాణాన్ని చూపించింది. మేము మొదట్లో అది అతని నిరంతర దగ్గుకు కారణమయ్యే అవరోధం అని భావించాం. అది పెన్నుమూత అని కనుగొన్నాం" అని శుభకర్ నాదెళ్ల చెప్పారు. విచారిస్తే ఆ వ్యక్తి అనుకోకుండా పెన్ను మూతను మింగేసిన విషయం తెలియవచ్చింది. అంతే వెంటనే పెన్ మూతను తొలగించే ప్రక్రియకు దాదాపు మూడు గంటలు పట్టింది.
 
ఆపై పెన్ క్యాప్‌ను విజయవంతంగా తొలగించాం. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. కానీ యాంటీబయాటిక్ చికిత్సతో సరిచేస్తాం.. రోగి పూర్తిగా కోలుకుంటున్నాడు... అని డాక్టర్ నాదెళ్ల అన్నారు.