బుధవారం, 19 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (20:59 IST)

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

Farm Land
రణగొణుధ్వనుల మధ్య నగర జీవితం చికాకు తెప్పిస్తోంది. కాస్త హైదరాబాద్ నగరానికి ఆవల శివారు ప్రాంతాల లోని పొలాల మధ్య ఫార్మ్ ల్యాండ్స్ ఫ్లాట్స్ వేస్తున్నారట... కొనేద్దామా అని ఆలోచించేవారికి హైడ్రా హెచ్చరికలు చేస్తోంది. ఇలాంటి ఫ్లాట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దని సూచిస్తోంది. ఇలాంటి ఫ్లాట్స్‌కి అనుమతులు వుండవనీ, అలా అనుమతులు లేకుండా ఫ్లాట్స్ వేసిన వారి దగ్గర్నుంచి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేయడం జరుగుతుందంటూ హైడ్రా పేర్కొంది.
 
వీకెండ్స్‌లో వ్యవసాయం చేసుకోవచ్చంటూ పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల్ని ఆకర్షించడం తమ దృష్టికి వచ్చిందనీ, ఆ ప్రకటనలతో బోల్తా కొట్టవద్దంటూ హైడ్రా హెచ్చరిస్తోంది. తెలంగాణ మునిసిపల్ చట్టం 2019 ప్రకారం ఫామ్ ల్యాండ్ క్రయవిక్రయాలపై నిషేధం వుందనీ, 2వేల చదరపు మీటర్లు లేదంటే 20 గుంటల స్థలం వుంటేనే ఫామ్ ల్యాండ్ పరిధిలోకి వస్తుందనీ, అంతకు తగ్గితే అది అలాంటి స్థలం కాదని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. కనుక నిబంధనలు పాటించకుండా వేసిన ఇలాంటి ఫ్లాట్స్ ఎవరైనా కొనుగోలు చేస్తే తదనంతర పర్యవసానాలకు హైడ్రా కానీ ప్రభుత్వం కానీ బాధ్యత వహించదంటూ పేర్కొన్నారు.