మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (16:16 IST)

శంషాబాద్ ఆలయంలో దేవతా విగ్రహాల ధ్వంసం.. ఎవరు? (video)

idols deities
idols deities
శంషాబాద్ ఆలయంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం పూజారి పూజ చేసేందుకు వచ్చిన తర్వాత  కొన్ని విగ్రహాలు ధ్వంసమైనట్లు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దుండగులు ఆలయ గేటు తెరిచి రాళ్లతో విగ్రహాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక బీజేపీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఈ ఘటనను ఖండించారు. ఆలయం ఉన్న ఎయిర్‌పోర్ట్ కాలనీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానంతో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇకపోతే.. అక్టోబర్ నెల 24 అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అమ్మవారి ఆలయంలోకి చొరబడి మరీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఆలయం వద్దకు చేరుకొని నిందితులను పట్టుకోవాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేపట్టారు.
 
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహానికి లోనయ్యారు. ఈ అంశంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.