బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (12:27 IST)

భారీ భద్రత మధ్య సల్మాన్ ఖాన్ చిత్ర షూటింగ్

Salman Khan
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తాజాగా 'సికందర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. ఇక్కడ పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్ రెండు రోజుల హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని సుప్రసిద్ధ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 
 
ఈ సీన్‌లో సల్మాన్ ఖాన్ సహా ఇతర కీలక తారాగణం పాల్గొంటున్నారు. సల్మాన్ ఖాన్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే. 'సికందర్' చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడం, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో... సల్మాన్ ఖాన్ చాలా తక్కువగానే బయట కనిపిస్తున్నాడు. కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగులకు హాజరవుతున్నాడు.
 
హైదరాబాదు బేగంపేట విమానాశ్రయంలో దిగిన సల్మాన్ తన బులెట్ ప్రూఫ్ వాహనంలో ఫలక్‌నుమా ఫ్యాలెస్ చేరుకున్న విజువల్స్ సోషల్ మీడియో వైరల్ అయ్యాయి. 25 రోజుల పాటు 'సికందర్' సినిమా చిత్రీకరణ హైదరాబాద్ నగరంలో జరగనుందని తెలుస్తోంది.