మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (12:43 IST)

సల్మాన్ ఖాన్‌కు మళ్ళీ బెదిరింపులు... 20 యేళ్ళ యువకుడి అరెస్టు

salman khan
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు వచ్చాయి. దీనిపై స్పందించిన పోలీసులు 20 యేళ్ల కుర్రోడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ నెల 25వ తేదీన బెదిరింపులకు పాల్పడగా, జీషన్ సిద్ధిఖీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నోయిడాలో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇటీవల మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన సభ్యులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ 20 యేళ్ళ యువకుడు బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన పోలీసులు నోయిడాలో 20 యేళ్ల యువకుడిని అరెస్టు చేశారు. జీషన్, సల్మాన్ ఖాన్‌లకు ఫోన్ చేసి బెదిరించిన నిందితుడు మహ్మద్ తయ్యబ్ అలియాస్ గుర్ఫాన్ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. నోయిడా సెక్టార్ 39లో తయ్యబ్‌ను పోలీసులు అరెస్టు చేసి ట్రాన్సిస్ వారెంట్‌పై ముంబైకి తరలిస్తున్నారు. 
 
కాగా, మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు బాబా సిద్ధిఖీ తనటుడు జీషన్ సిద్ధిఖీని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ వర్గంలో చేరారు. ఈయన తండ్రి బాబా సిద్ధిఖీ కూడా కాంగ్రెస్ పార్టీనే కావడం గమనార్హం. ఈ యేడాది ఆరంభంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్సీపీలో చేరారు. 
 
కాగా, బాబా సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశారు. ఆయనను హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా మెలుగుతుండటంతో ఆయన తమ టార్గెట్ అయ్యారని ఆ ముఠా సభ్యులు ప్రకటించారు.