బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (13:26 IST)

కవితతో కేటీఆర్.. భావోద్వేగంతో పాటు సరదా మాటలు (వీడియో)

KTR_Kavitha
KTR_Kavitha
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 5 నెలల పాటు ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఆమెకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాసేపట్లో హైదరాబాద్‌కి రాబోతున్నారు. 
 
ఈ సందర్భంగా జైలు నుంచి విడుదలైన కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో కవిత కలిసి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత అంటే కేసీఆర్ బిడ్డ మాత్రమే కాదని.. ఆమె తెలంగాణ బిడ్డ అని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.