తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన
తెలంగాణలోని 15 స్టేషన్లు, 50 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలతో కలిపి 550 అమృత్ భారత్ స్టేషన్‌ల నిర్మాణానికి ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వే శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రైల్వే లైన్లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో డబ్లింగ్, ట్రిపుల్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దీంతో పాటు రైల్వే క్రాస్‌ల వద్ద రద్దీని నివారించేందుకు రైల్వే ఫ్లై ఓవర్లు, రైలు అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నారు.
రైళ్లు, రైల్వే లైన్లను విస్తరించడమే కాకుండా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
అందులో భాగంగా, భారతీయ రైల్వేలు "అమృత్ భారత్ స్టేషన్లు" అనే కొత్త పథకాన్ని ప్రారంభించాయి.
రెండు వేలకు పైగా రైల్వే స్టేషన్లలో ప్రసారమయ్యే వర్చువల్ ఈవెంట్‌లో వివిధ రాష్ట్రాలలో దాదాపు 1,500 రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.