మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (20:03 IST)

వైద్య విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్

head
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలోని వైద్య కాలేజీలో అమానవీయ ఘటన జరిగింది. ఓ విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగా చేసుకోలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై సదరు విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఖమ్మం వైద్య కళాశాలలో ఈ యేడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరిగా హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన ద్వితీయ సంవత్సర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్లు ఇలా కటింగ్ చేయించుకోవద్దని సూచించారు. దీంతో అతను సెలూన్‌కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. అయితే ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఆయన విద్యార్థిని సెలూను తీసుకువెళ్లి ఏకంగా గుండు కొట్టించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుండి తప్పించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు విచారణకు ఫోర్మెన్ కమిటీని నియమించామని ప్రిన్సిపాల్ మీడియాకు తెలిపారు.