బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2024 (10:43 IST)

తెలుగు విమాన ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త

air india express
ప్రైవేటు రంగ విమాన సంస్థగా మారిన ఎయిరిండియా తెలుగు రాష్ట్రాల్లోని విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. శీతాకాల సర్వీసుల్లో భాగంగా అదనపు సర్వీసులను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అదనపు సర్వీసులను నడుపనున్నట్టు తెలిపింది. దీంతో ఈ మూడు నగరాల నుంచి వారంలో నడిచే సర్వీసుల సంఖ్య 173 నుండి 250కి పెరిగాయి.
 
కొత్తగా ప్రకటించిన సర్వీసుల్లో హైదరాబాద్ - గ్వాలియర్ డైరెక్ట్ సర్వీస్, విశాఖపట్నం - విజయవాడ సర్వీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసుల సంఖ్య పెంచారు. అలానే హైదరాబాద్ నుంచి 17 దేశీయ గమ్యాలు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన విమానాశ్రయాలకు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుపుతున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ తెలిపారు.
 
విజయవాడ నుంచి అంతర్జాతీయ గమ్యాలకు విమాన సర్వీసులు నడుపుతున్న ఏకైక సంస్థ ఎయిరిండియానే అని ఆయన చెప్పారు. సీజన్ మొత్తం మీద ఈ నగరాల నుంచి సర్వీసుల సంఖ్య 45 శాతం పెరిగినట్లు అంకుర్ గార్గ్ తెలిపారు.