గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (10:34 IST)

వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి

sajjala ramakrishna reddy
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. జగన్ ఆదేశాలతో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, బొడ్డేడ ప్రసాద్‌లను నియమించారు. 
 
కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత కాగా, బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి జిల్లాకు చెందినవారు. ఇటీవల ఒంగోలు నియోజకవర్గ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన నేపథ్యంలో... ఒంగోలు నియోజకవర్గానికి కూడా ఇన్చార్జిని నియమించారు. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిని నియమిస్తూ జగన్ ఆదేశాలు ఇచ్చారు.