సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (11:38 IST)

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ? 14 మంది అమ్మాయిలు కూడా.. (Video)

rave party
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌ హౌస్‌లో రేవ్ పార్టీని తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ నగర సమీపంలోని జవ్వాడలో ఉన్న ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించడంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించింది. జవ్వాడలోని రివర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం పార్టీ నిర్వహించారు. భారీ డీజే శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టుప స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో ప్రత్యేక బృందం పోలీసులు అక్కడకు చేరుకుని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ పార్టీలో 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రాజ్ పాకాల కూడా కూడా పాజిటివ్ అని వచ్చినట్టు సమాచారం. కొకైన్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో భారీగా విదేశీ మద్యం, బీర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 21 మంది పురుషులు, 14 మంది అమ్మాయిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.