ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (15:21 IST)

తెలంగాణ జిల్లాల నుంచి తిరువణ్ణామలైకు ప్రత్యేక బస్సులు!! (Video)

tsrtc
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి గిరిప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఏర్పాటు చేసింది. 
 
ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అరుణాచలగిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్‌ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.