శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:47 IST)

తిరువణ్ణామలై నుంచి తిరుపతికి.. ఆర్టీసీ బస్సు బోల్తా

road accident
తిరుపతి నగర సమీపంలోని బాలాజీ డైరీ వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ బస్సులో అందులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 
 
టిప్పర్‌ను ఢీకొట్టకుండా తప్పుకునేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బస్సును ఆపడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 
 
తిరువణ్ణామలై నుంచి వస్తున్న బస్సు 42 మంది ప్రయాణికులతో తిరువణ్ణామలై నుంచి తిరుమలకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఎస్వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.