శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (15:59 IST)

అరుణాచలంలో గిరి ప్రదక్షణ చేస్తే.. ఏంటి లాభం?

Arunachalam
Arunachalam
అరుణాచలంలో గిరి ప్రదక్షణ చేయడం ద్వారా పాపాలు నశించిపోతాయి. శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తిరువణ్ణామలై కొండ సిద్ధ పురుషులు జీవించే కోట అని.. గిరి ప్రదక్షణతో సిద్ధుల అనుగ్రహం కూడా లభిస్తుందని ఐతిహ్యం. 
 
గిరి ప్రదక్షణ చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. గిరి ప్రదక్షణ చేయడం ద్వారా.. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాధులు తీరుతాయి. గిరి ప్రదక్షణతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుముఖం పడుతుంది. శరీర బరువు తగ్గుతుంది. గిరి ప్రదక్షణ చేయడం వల్ల కుటుంబంలో ఐక్యత, సుభిక్షం ఏర్పడుతుంది. గిరి ప్రదక్షణతో వ్యాపారంలో పురోగతి ఏర్పడుతుంది. 
 
విద్యార్థులు విద్యలో ఉత్తమంగా రాణిస్తారు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ చేస్తే.. ధనవంతులు కావడం ఖాయమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో గిరి ప్రదక్షణ శ్రేష్ఠమైనది.