శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 మే 2024 (08:24 IST)

హైదరాబాద్ నగరంలో గోడకూలి ఏడుగురు మృత్యువాత!!

deadbody
హైదరాబాద్ నగరంలో గోడకూలి ఏడుగురు మృత్యువాతపడ్డారు. సోమవారం నుంచి రాత్రి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలో గోడకూలి ఏకంగా ఏడుగురు చనిపోయారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గోడకూలిపోయింది. ఈ శిథిలాల కింద ఏడుగురు మృతదేహాలను స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. మృతులను రామ్ యాదవ్, గీత, హిమాన్షు, తిరుపతిరావు, శంకర్, రాజు, ఖుషిగా గుర్తించారు. 
 
కాగా, గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం ఏడుగు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా మండుటెండల నేపథ్యంలో మంగళవారం కురిసిన భారీ వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. అయితే, పలుచోట్ల నాలాలు పొంగడం, ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు ఎదురయ్యాయి.