Festival Posters
✕

తనను మేడం అని పిలవద్దు ప్లీజ్... సీతక్క అని పిలిస్తే చాలు : మంత్రి సీతక్క

Written By ఠాగూర్
Updated: గురువారం, 28 డిశెంబరు 2023 (18:21 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆ రాష్ట్ర అధికారులకు ఓ విజ్ఞప్తి చేశారు. తనను మేడమ్ అని పిలవద్దని ఆమె కోరారు. సీతక్క అని పిలిస్తే సరిపోతుందని అధికారులకు సూచించారు. గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆమె అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామినిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆమెను పలువురు ఉన్నతాధికారులు మేడమ్ అంటూ సంభోధించసాగారు. ఈ పిలుపు ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. అందుకే తనను మేడమ్ అని పిలవద్దని, సీతక్క అని పిలిస్తే చాలని సూచించారు. మేడం అంటే దూరం అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. నన్ను సీతక్క అంటేనే మీ చెల్లిగా, అక్కడా కలిసిపోతాం అని వ్యాఖ్యానించారు. 
 
పదవులు శాశ్వతం కాదని, విలువలు, మంచి పనులే మనకు శాశ్వతమన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదని, గల్లీ బిడ్డల పాలన అని పేర్కొన్నారు. ప్రజలకు ఎపుడు ఏం అవసరమున్నా తమతో చెప్పుకోవచ్చని ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా, అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా, ఆమె జామినాలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

అన్నీ చూడండి

నా బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు : 'యాక్షన్ కింగ్' అర్జున్

కన్నతల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేదు.. అపుడు ఆమె ఆదుకుంది : ధన్‌రాజ్

Aakashamlo Oka Tara Review: స్పూర్తి కలిగించేదిగా ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ

స్టేజిపై హీరోయిన్‌కు ముద్దు పెడతానంటూ దగ్గరకు లాక్కున్న హీరో, అంత బలుపా అంటూ ట్రోల్స్

మూస చిత్రాలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు, టీజర్ లాంఛ్

తర్వాతి కథనం
Show comments