బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జనవరి 2024 (19:00 IST)

పానీపూరీ తిన్న అన్నదమ్ములు మృతి.. ఎక్కడో తెలుసా?

panipuri
పానీపూరీ తిన్న ఇద్దరు అన్నదమ్ములు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. 
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. గ‌త‌ రాత్రి పానీపూరీ తిని కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులను కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందారు. 
 
చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములు వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6) జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
 
పానీపూరీ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి తమ బిడ్డలు చనిపోయారని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
నంద్యాల జిల్లా వైఎస్సార్‌ కాలనీ నుంచి బ్రతుకుతెరువు కోసం ప్లాస్టిక్ వ్యాపారం చేసేందుకు జంగారెడ్డిగూడెంకు వెలపాటి కుటుంబం వలస వచ్చింది. ఊహించని రీతిలో ఇద్దరు పిల్లలు మృత్యువాతపడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.