శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (14:28 IST)

గ్రేటర్ హైదరాబాదులో రెచ్చిపోతున్న వీధి కుక్కలు

dogs
గ్రేటర్ హైదరాబాదులో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. హైదరాబాదు దిల్‌షుక్ నగర్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. దిల్‌షుక్ నగర్ పీఎన్టీ కాలనీ శాంతినగర్ వీధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. వాటిని చూసి చిన్నారులు భయంతో గేటు నుంచి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 
 
రెండు కుక్కలు పిల్లలు పరిగెత్తే సరికి వదిలిపెట్టి వెళ్లిపోగా, ఒక కుక్క మాత్రం కిందపడిపోయిన బాలుడిని వెంబడించింది. అంతలో కిందపడిపోయిన బాలుడిని ఒక మహిళ దగ్గరకు తీసుకుంది. మిగిలిన ఇద్దరు పిల్లలు, మరో వ్యక్తి.. దాడి చేసిన కుక్కను తరిమికొట్టారు. 
 
ఈ ఘటనలో ఒక బాలుడికి మాత్రం స్వల్ప గాయాలైనాయి. ప్రస్తుతం ఆ బాలుడు ప్రస్తుతం నిలోఫర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.