బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (14:32 IST)

భార్య, ఇద్దరు పిల్లలను కాల్చాడు.. కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

Gunman
Gunman
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కలెక్టర్‌ గన్‌మెన్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆకుల నరేష్‌ అనే కానిస్టేబుల్‌ కలెక్టర్‌ గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేష్ తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కూతురు హిమశ్రీలను తుపాకీతో కాల్చాడు. 
 
అనంతరం కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 
 
 
అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. గొడవ తీవ్రరూపం దాల్చడంతో కోపంతో నరేష్ పాఠశాలకు వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. ముందుగా భార్యను తుపాకీతో కాల్చి, పిల్లలను కూడా కాల్చాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.