బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (17:21 IST)

'కంగువా' షూటింగులో ప్రమాదం.. హీరో సూర్యకు తప్పిన ప్రాణాపాయం

surya
హీరో సూర్యకు ప్రాణాపాయం తప్పింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కంగువా'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. చిరుత్తై శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబై, కొడైక్కెనాల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జరుపుకుంది. ఇపుడు చెన్నై నగర శివారు ప్రాంతంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. పాన్ఇండియా స్థాయిలో 11కి పైగా భాషల్లో రూపొందిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 
 
ఈ చిత్రం షూటింగులో భాగంగా, గురువారం భారీ యాక్షన్ సన్నివేశానికి ప్లాన్ చేశారు. ఈ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, పది అడుగుల ఎత్తు నుంచి రోప్ తెగిపోవడంతో కెమెరా వచ్చి మీదపడింది. దీంతో సూర్య  భుజానికి గాయమైంది. వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ నిలిపివేసిన చిత్ర బృందం.. హీరోను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ ప్రమాదంపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.