బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (12:33 IST)

సన్ సిటీ దగ్గర బాణసంచా షాపులో అగ్నిప్రమాదం

fire
హైదరాబాదులో సన్ సిటీ దగ్గర బాణసంచా షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో బాణసంచా షాపు నుంచి మంటలు.. పక్కనే ఉన్న ఫుడ్‌కోర్టుకు వ్యాపించాయి. దాంతో అందులోని సిలిండర్లు పేలిపోయాయి. దాంతో మంటలు మరింత పెరిగి.. పక్కనే ఉన్న మరో రెండు షాపులకు వ్యాపించాయి. 
 
బాణసంచా షాపుతోపాటూ.. మొత్తం 4 షాపులు పూర్తిగా కాలిపోయాయి. నాలుగు ఫైరింజన్లతో మంటల్ని ఆర్పారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఎక్కువగానే ఉన్నా, ప్రాణ నష్టం ఏదీ జరగలేదని పోలీసులు తెలిపారు.