బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2023 (12:28 IST)

బెజవాడలో కారు రేసింగ్.. గాల్లోకి ఎగిరిన యువకులు... ఎలా?

car accident
ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడ (బెజవాడ)లో కారు రేసింగ్ కలకలం సృష్టించింది. విజయవాడలోని రమేష్ ఆస్పత్రి సమీపంలో ఈ కార్ల రేసింగ్ వల్ల నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బెంజ్ కారు, ఫార్చునర్ కార్లలో అమ్మాయిలు, అబ్బాయిలు రేసింగ్ చేస్తుండగా, ఎదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టారు. దీంతో ఆ బైకులు రెండు ముక్కలు కాగా, వాటిపై ప్రయాణం చేస్తూ వచ్చిన నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో నుంచి అమ్మాయి, అబ్బాయిలు దిగి మరో కారులో పారిపోయారు. విజయవాడ రామవరప్పాడు వైపు వెళుతున్న రెండు స్కూటీలను కారు రేసింగ్‌లో పాల్గొన్న కార్లు బలంగా ఢీకొట్టాయి. 
 
దీంతో స్కూటీపై వెళుతున్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. వేగంగా వచ్చిన ఫార్చునర్ కారు బలంగా ఢీకొట్టడంతో కారు రెండు ముక్కలైంది. యువతీయువకులు భయంతో కారును అక్కడే వదిలివేసి మరో కారులో పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో రేసింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.