శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (23:11 IST)

అల్లు అర్జున్‌కు హెల్త్ ఇష్యూ?: ఐటమ్ సాంగ్‌కు బ్రేక్

Allu Arjun's Pushpa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుష్ప-2 షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటమ్‌ సాంగ్‌ని ఈ వారంలోనే చిత్రీకరించడానికి దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేశారు. 
 
అయితే అల్లు అర్జున్‌ అనుకోకుండా అనారోగ్యం పాలవ్వడంతో ఈ పాట షూటింగ్ వాయిదా పడింది. ఈ వారంలో జరిగే పాట చిత్రీకరణ విషయంలోనూ చాలాసార్లు రిహార్సల్స్ చేశారని.. అయితే ఉన్నట్టుండి ఆయన సిక్‌ అవ్వడంతో షూటింగ్‌ని ఈ నెల రెండోవారానికి మేకర్స్‌ పోస్ట్‌ పోన్‌ చేశారు. 
 
షూటింగ్‌లో అల్లు అర్జున్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఏర్పడిన అస్వస్థత కారణంగా పుష్ప2 ఐటమ్ సాంగ్ షూటింగ్‌కు బన్నీ దూరమైనట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల కానుంది.