బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (17:21 IST)

యాభై, ఎనభై నాటి సెట్ లో వరుణ్ తేజ్ మట్కా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది

matka on set
matka on set
వరుణ్ తేజ్, పలాస, శ్రీ దేవి సోడా సెంటర్ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రంతో పాన్ ఇండియన్ అరంగేట్రం చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి (సివిఎం) భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్ , అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం జరుపుకుంటున్న షూటింగ్ కోసం ఓ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ కథ 1958, 1982 మధ్య జరిగినందున, యూనిట్ 50, 80ల నాటి పరిసరాలను అద్భుతంగా రిక్రియేట్ చేస్తున్నారు.
 
యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా ‘మట్కా’ కథను రూపొందించారు.  24 ఏళ్లస్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కు హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈసినిమా కోసం వరుణ్ పూర్తి మేక్ఓవర్ అవుతున్నారు
 
వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
 ఈచిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌత్‌లో అత్యంత బిజీగా ఉన్న కంపోజర్‌లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా,  తంగలన్ ఫేమ్ ఏ కిషోర్ కుమార్ డీవోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ (పుష్ప ఫేమ్) ఎడిటర్. ఆశిష్ తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్. మల్టిపుల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్న ఈ చిత్రానికి  నలుగురు ఫైట్ మాస్టర్‌లు యాక్షన్ ను పర్యవేక్షిస్తున్నారు.
 ‘మట్కా’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
 
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, సత్యం రాజేష్, రవిశంకర్, అజయ్ ఘోష్, రూప లక్ష్మి, అవినాష్ కనపర్తి