మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (10:55 IST)

భార్యతో పాటు ముగ్గురు చిన్నారులను గొంతునులిమి హత్య

murder
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. భర్త తన భార్యను, ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. బిలాస్‌పూర్ ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, భార్యపై అనుమానంతో నిందితుడైన భర్త ఈ నేరానికి పాల్పడ్డాడు. 
 
మృతి చెందిన చిన్నారుల్లో నాలుగు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు ఉండగా, కుమారుడికి రెండేళ్ల వయస్సు ఉంటుందని బిలాస్‌పూర్ ఎస్పీ తెలిపారు.
 
బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరిలో ఓ వ్యక్తి తన భార్య నమ్మకద్రోహం చేశాడనే అనుమానంతో ఓ మహిళను, ఆమె ముగ్గురు పిల్లలను హతమార్చాడని ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
 
ఈ ఘటన మస్తూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిర్రి గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు తన భార్యను, ముగ్గురు మైనర్ పిల్లలను గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని ఉమేంద్ర కేవత్‌గా గుర్తించామని, అతడిని హత్యానేరం కింద అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.