1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:56 IST)

రైతును తొక్కి చంపేసిన అడవి ఏనుగు.. ఎక్కడ?

elephant
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ఓ రైతును అడవి ఏనుగు తొక్కి చంపినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి పొరుగున ఉన్న మహారాష్ట్రలోకి ప్రవేశించిన మంద నుంచి విడిపోయిన ఏనుగు కౌతాల మండలం బూరేపల్లె గ్రామంలో వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది.
 
ఈ ఘటనలో అల్లూరి శంకర్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఏనుగు సంచారం వుండటంతో ఆ ప్రాంత ప్రజలకు బీభత్సం సృష్టించింది. తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మగ ఏనుగు మహారాష్ట్రలోని గడ్చిరోలి మీదుగా చత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. 
 
రెండు రోజుల క్రితం గడ్చిరోలి అడవుల్లోకి ప్రవేశించిన మందలో కొంత భాగం ప్రాణహిత నదిని దాటి తెలంగాణ గ్రామంలోకి ప్రవేశించిందన్నారు. మరోవైపు మృతుడి కుటుంబానికి అటవీశాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.