ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (21:58 IST)

జంట నగరాల్లో సెప్టెంబర్ 17, 18తేదీల్లో మందు షాపులు బంద్

wine shop
సెప్టెంబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని మందు షాపులు మూతపడనున్నాయి. 
గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని వైన్, బార్ షాపులను మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది.
 
తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968లోని సెక్షన్ 20 కింద జారీ చేసిన ఈ ఉత్తర్వు నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వుండేందుకు గాను వైన్ షాపులను మూతవేయనున్నారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న బార్‌లు మినహా రెస్టారెంట్‌లకు అనుబంధంగా ఉన్న బార్‌లు కూడా మూసివేయబడతాయి.
 
 నోటిఫికేషన్‌ను ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నగరంలోని అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్పెక్టర్‌లకు అధికారం ఇవ్వబడింది.