శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జూన్ 2024 (20:48 IST)

మహిళపై పాశవిక దాడి.. కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి? (video)

Woman attacked
Woman attacked
నాగర్ కర్నూల్ - కొల్లాపూర్ మండలంలో సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళ పనికి రావట్లేదని యజమాని దాడి చేసింది. చెంచు మహిళను ఒంటరి చేసి మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవిక దాడి చేశారు. 
 
ఈశ్వరమ్మను మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి, కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.