గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 18 నవంబరు 2022 (19:43 IST)

కస్తూర్బా గాంధీ కాలేజీలో గ్యాస్ లీక్: 30మంది విద్యార్థులకు అస్వస్థత

సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీలో కెమికల్ గ్యాస్ లీక్ వ్యవహారం మిస్టరీగా మారింది. మొదట కాలేజీ సైన్స్ ల్యాబ్ నుంచి గ్యాస్ లీక్ అయిందని వార్తలు వచ్చాయి. 
 
యాజమాన్యం మాత్రం అసలు సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేసే లేదని చెబుతోంది. బయటి నుంచి వచ్చిన గ్యాస్ వల్లే విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని యాజమాన్యం ఫైర్ అయ్యింది. 
 
ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు క్లూస్ టీమ్‌తో కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. కాలేజీ పరిసరాలతో పాటు ల్యాబ్‌ని పరిశీలించారు. యాజమాన్యం, విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయ్యిందనే దానిపై ఆరా తీస్తున్నారు.