ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (13:57 IST)

కూకట్‌పల్లిలో దారుణం.. వాటర్‌ ట్యాంక్‌ గోడ కూలి చిన్నారి?

కూకట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. వాటర్‌ ట్యాంక్‌ గోడ కూలి చిన్నారి బలైపోయింది. కూకట్‌పల్లి శాతవాహననగర్‌లో నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ గోడకూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది
 
వివరాల్లోకి వెళితే..మంగళవారం ఉదయం తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆ దారిలో నిర్మాణం జరుగుతున్న నీటి ట్యాంక్‌ గోడ శిథిలాలు కూలి చిన్నారి మీద పడ్డాయి. 
 
ఈ ఘటనలో శరోన్‌ దీత్య(4)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లఎదుటే పాప మృతి చెందడంతో ఆ తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.