ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2016 (11:41 IST)

తెలంగాణ ఎమ్మెల్సీ నారదాసు ప్రేమ వివాహం.. కేసీఆర్ ఆశీర్వాదం.. 61 ఏళ్లలో ప్రేమ పెళ్లి

తెలంగాణ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వివాహం శుక్రవారం జరిగింది. నారదాసు ప్రేమ వివాహం చేసుకున్నారు. అడ్వకేట్‌ వర్షను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. నాంపల్లిలోని సబ్‌రిజిస్ట్రా‌ర్‌ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ

తెలంగాణ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వివాహం శుక్రవారం జరిగింది. నారదాసు ప్రేమ వివాహం చేసుకున్నారు. అడ్వకేట్‌ వర్షను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. నాంపల్లిలోని సబ్‌రిజిస్ట్రా‌ర్‌ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు వీరి వివాహం జరిగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీ నారదాసు హిమాయత్‌నగర్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 
 
హిమాయత్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వర్ష ఉండేవారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సోదరుడు ఎన్‌.ఆగమరావు, స్నేహితుడు జి.శ్రీనివాసరావు పెళ్లిపెద్దలుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోనున్నట్లు నారదాసు వెల్లడించారు. హంగు ఆర్భాటం లేకుండా నారదాసు పెళ్లి జరిగింది. 61 ఏళ్లలో ఆయన ప్రేమ వివాహం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.