శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (20:55 IST)

#HyderabadRains: ఇంట్లోకి వచ్చిన పామును ఆఫీసులో వదిలేశాడు (వీడియో)

snake
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అలాగే వర్షాల కారణంగా పాములు, ఇతరత్రా కీటకాలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. 
 
ఇంట్లోకి నీరు చేరి పాము వచ్చిందని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ యువకుడు వినూత్న ఆందోళన చేశాడు. 
 
హైదరాబాద్ అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో, యువకుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులకు ఫిర్యాదు చేసి ఆరు గంటలు గడిచినా ఎవరూ పట్టించుకోలేదు. 
 
అంతే సహనం కోల్పోయిన ఆ యువకుడు ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకుని నేరుగా దానిని జీహెచ్ఎంసీ ఆఫీసుకు తీసుకొచ్చి టేబుల్‌పై వదిలి నిరసన తెలిపాడు. 
 
యువకుడు పామును తెచ్చి నిరసన తెలపడాన్ని కొందరు వీడియో తీశారు. ఈ వీడియో నెట్టించ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.