బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (13:04 IST)

పెళ్లికి ఒక్క రోజు ముందు ప్రియుడితో వధువు జంప్.. ఎక్కడ?

ఈ మధ్య ప్రేమ కారణంగా పెళ్లి పీటలపై ఆగిపోవడాలు వినే వుంటాం. తాజాగా అలాంటి ఘటనే సిరిసిల్లలో చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇందిరమ్మ కాలనీకి చెందిన లావణ్య అనే అమ్మాయి గత కొంతకాలంగా శ్రీనివాస్‌(తంగళ్లపల్లి) ప్రేమిస్తోంది. 
 
తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పినా కూడా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. ఆమెకు నిశ్చితార్థం జరిపించారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కోపంతో.. పెళ్లికి ఒక రోజు ముందే ఇంట్లో నుంచి పారిపోయింది. తాను ప్రేమించిన అబ్బాయి శ్రీనివాస్‌నే పెళ్లి చేసుకుంటానని లేఖ రాసి లావణ్య వెళ్లినట్లు సమాచారం. కూతురు అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.