గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (11:16 IST)

తెలంగాణలో వేడిగాలులు.. వానల్లేవ్.. ఎండాకాలంలా ఉక్కపోత

summer
తెలంగాణలో వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తొలుత దంచికొట్టిన వానలు తర్వాత తగ్గిపోయాయి. అప్పుడప్పుడు మేఘాలు కమ్ముకున్నా వర్షం మాత్రం రావట్లేదు. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది. వాతావరణం ఇలా వేడెక్కడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. 
 
దీనికితోడు వేడు గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వస్తుంటాయి. అవి వస్తే తప్ప వాతావరణం చల్లబడే అవకాశం లేదని వాతావరణశాఖ అభిప్రాయపడింది. 
 
అయితే, ఈ నెల 9 వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం 32 డిగ్రీలు, ఆపై ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.