గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (23:08 IST)

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌: పాకిస్థాన్ శుభారంభం.. నెదర్లాండ్స్‌పై విజయం

pakistan team
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు శుభారంభం చేసింది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన నెదర్లాండ్‌కు పాకిస్థాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో నెదర్లాండ్స్ 205 పరుగులకే పరిమితం అయ్యింది. పదునైన పాక్ బౌలింగ్ దాడులకు నిలవలేకపోయిన డచ్ జట్టు 41 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 
 
పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, హసన్ అలీ 2, షహీన్ అఫ్రిది 1, ఇఫ్తికార్ అహ్మద్ 1, మహ్మద్ నవాజ్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ బౌలర్‌లో బాస్ డీ లీడ్ 4 వికెట్లు తీశాడు. కొలిన్ అకెర్ మన్ 2, ఆర్యన్ దత్ 1, వాన్ బీక్ 1, వాన్ మీకెరెన్ 1 వికెట్ పడగొట్టారు.