1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (16:40 IST)

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో పదో స్వర్ణం.. టెన్నిస్, స్క్వాష్‌లలో అదుర్స్

Asia Games 10th Gold for India
Asia Games 10th Gold for India
చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్లో రోహన్ బోపన్న రుతుజా భోసాలే జోడీ ఫైనల్లో విజయకేతనం ఎగురవేసింది.
 
చైనీస్ తైపీకి చెందిన ఎన్ షువో లియాంగ్, త్సుంగ్ హావో హువాంగ్ జోడీపై 2-6, 6-3, 10-4తో బోపన్న, రుతుజా అద్భుత విజయం సాధించారు. 
 
కాగా, సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా క్రీడల్లో చైనా 107 స్వర్ణాలు సహా మొత్తం 206 పతకాలతో అగ్రస్థానంలోకొనసాగుతోంది. దీంతో భారత్ 19 స్వర్ణ పతకాలు సాధించింది. 
 
తాజాగా తాజాగా స్క్వాష్ ఈవెంట్లోనూ స్వర్ణం లభించింది. అది కూడా పాకిస్థాన్ ను ఓడించి ఈ పతకం నెగ్గడంతో భారత బృందంలో సంతోషం రెట్టింపైంది. పురుషుల స్క్వాష్ టీమ్ ఈవెంట్ బెస్టాఫ్ త్రీ ఫైనల్ పోటీలో భారత్ 2-1తో పాక్‌ను ఓడించింది.
 
తొలి ఫైనల్లో ఎం మహేశ్ 8-11, 3-11, 2-11తో పాక్ ఆటగాడు నాసిర్ ఇక్బాల్ చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే, సౌరవ్ ఘోషాల్ 11-5, 11-1, 11-3తో మహ్మద్ ఆసిమ్‌పై నెగ్గి భారత అవకాశాలను సజీవంగా నిలిపాడు. 
 
ఇక కీలకమైన మూడో ఫైనల్లో అభయ్ సింగ్ 11-7, 9-11, 7-11, 11-9, 12-10తో నూర్ జమాన్ పై నెగ్గి భారత్ కు స్వర్ణం అందించాడు. దీంతో భారత్ ఖాతాలో పది స్వర్ణ పతకాలు చేరాయి.