గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (12:21 IST)

జవహర్‌లాల్ నెహ్రూ మన మొదటి ప్రధాని కాదు.. బసనగౌడ

Nehru
భారతదేశానికి తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, నెహ్రూ కాదని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బసనగౌడ ప్రసంగిస్తూ ‘జవహర్‌లాల్ నెహ్రూ మన మొదటి ప్రధాని కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన తొలి ప్రధాని. 
 
నేతాజీ వల్లే బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టారని వ్యాఖ్యానించారు. భయం అంటే ఏమిటో బ్రిటిష్ వారు చూపించారని, అందుకే దేశం విడిచి వెళ్లిపోయారని బసనగౌడ అన్నారు. 
 
నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిరాహార దీక్ష వల్ల దేశానికి స్వాతంత్య్రం రాలేదన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు దేశాన్ని విడిచిపెట్టినప్పుడు, దేశం స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు నేతాజీ స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి. 
 
ఆగస్టులో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లేదా ఏడు నెలల్లో కూలిపోతుంది. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు నడుస్తోందని, అది కాంగ్రెస్ పతనానికి దారితీస్తుందని బసనగౌడ పాటిల్ అన్నారు.