బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (19:43 IST)

ఉసిరికాయతో నెయ్యి లడ్డూలు ఎలా చేయాలంటే?

Amla Laddu with Dry Fruit
Amla Laddu with Dry Fruit
ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఇంకా చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి మొత్తం శరీర ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలను అందిస్తాయి. ఉసిరికాయను ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అలాంటి ఉసిరికాయతో నెయ్యి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు 
ఉసిరి కాయలు- 10 
బెల్లం-  250 
యాలకుల పొడి- ఒక స్పూన్ 
నట్స్ రకాలు- తగినంత 
నెయ్యి - ఒక స్పూన్ 
 
తయారీ విధానం: మొదట ఉసిరి కాయలను కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో ఉసిరి కాయలను ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించాలి. ఆపై ఉసిరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 
 
ఆపై వెడల్పాటి పాత్రలో ఉసిరికాయ మిక్సీ పట్టుకున్న పొడికి బెల్లం కలపాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇందులో యాలక్కాయ పొడి, వేయించిన నట్స్ పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉండలు ఉండలుగా తయారు చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు నెయ్యిని కలుపుకుంటూ చేస్తే ఉసిరికాయ నెయ్యి లడ్డూలు తయారైనట్లే.