శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (20:40 IST)

పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. టార్గెట్ 287

Pakistan
Pakistan
వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ 68, సాద్ షకీల్ 68 పరుగులు చేశారు. 
 
లోయరార్డర్‌లో మహ్మద్ నవాజ్ 39, షాదాబ్ ఖాన్ 32 పరుగులు సాధించారు. చివరిలో హారిస్ రవూఫ్ 16, షహీన్ అఫ్రిది 13 (నాటౌట్) పరుగులు సాధించారు. 
 
నెదర్లాండ్స్ బౌలర్‌లో బాస్ డీ లీడ్ 4 వికెట్లు తీశాడు. కొలిన్ అకెర్ మన్ 2, ఆర్యన్ దత్ 1, వాన్ బీక్ 1, వాన్ మీకెరెన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం, 287 పరుగుల లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది.