శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (17:27 IST)

బాంబు దాడితో దద్ధరిల్లిన పాకిస్థాన్.. 58మంది మృతి

bomb blast
పాకిస్థాన్ బాంబు దాడితో దద్ధరిల్లింది. బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో 52మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50కి పైబడిన వారు గాయపడ్డారు. అలాగే కొన్ని గంటల తర్వాత, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని హంగూ నగరంలోని మసీదులో జరిగిన మరో పేలుడులో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు. 12 మంది గాయపడ్డారు.
 
మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ర్యాలీకి సమాయత్తం అవుతుండగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఆత్మాహుతి దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుతో తమకు సంబంధం లేదని ‘ది పాకిస్థాన్ తాలిబన్’ (టీటీపీ) స్పష్టం చేసింది.