ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (12:35 IST)

తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. విద్యార్థులకు ఇడ్లీ, చట్నీ

పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడం, బడి పిల్లల హాజరును మెరుగుపరచడం, పిల్లల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమైంది. 
 
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతుల మీదుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 
 
ఈ సందర్భంగా విద్యార్థులకు ఇడ్లీ, చట్నీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.